A Short Film by Nanda Kishore Abburu Add Comment Tanguturi Suryakumari Singing Maa Telugu Talliki at the Rangaraya Medical College Old Students Association Reunion in Birmingham in 1985 Click here for Flash Mob in Mumbai ShriFX and Flickrollers proudly presents Flash mob at GVK One Hyderabad on 11 Dec 2011. Due credits to the friendly Hyderabadis who gave us their footage. Very successful flash mob with thunderous response from the crowd and dancers with awesome energy made it a lightening Sunday in Hyderabad.... This FLASH MOB is conducted just to promote dance in the city .. This Flash mob is not a choreographed dance item its just to spread fun n makes others watching come n participating . Comparing it wid mumbai makes no sense .. mumbai has done nearly a month plus planning n practicing to make tht happen to pay a tribute to the 26/11 but this flash mob was conducted just in 2 days .... thts the effort ... Appreciate the effort of every one involved in this ...Thank you స్కూల్లో చదివిన ఆమ్స్టర్డ్యామ్... సహజమైన ఓడరేవుల నగరం... ఒకప్పటి అమెరికా రాజధాని... ఇప్పుడు ప్రపంచ ఆర్థిక కేంద్రం... అత్యధిక భాషలకు ఆవాసం... ‘క్రాస్‌రోడ్స్ ఆఫ్ ద వరల్డ్’ ఈ నగరం... అమెరికా స్వాతంత్య్ర చిహ్నానికి స్థావరం... న్యూయార్క్ నగరం... న్యూయార్క్ నగరంలో పబ్లిక్ లైఫ్ చాలా బిజీగా ఉంటుంది. నగరం దీవుల సమూహం... కాబట్టి వాటిని కలుపుతూ బ్రిడ్జిలు ఉంటాయి. హడ్సన్ నది పాయలుగా చీలి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. నది పాయల మధ్య ఉన్న భూభాగాలే ఈ దీవులు. వాటిలో మన్హాటన్, స్టాటెన్, లాంగ్ ఐలాండ్లు ప్రధానమైనవి. చిన్న పెద్ద కలిసి ముప్పైకి పైగా దీవులు ఉన్నాయి. మన్హాటన్ దీవి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆర్థిక లావాదేవీల కేంద్రం. న్యూయార్క్ స్టాక్ఎక్సేంజ్ ఇక్కడే ఉంది. మన్హాటన్లో జీవితం చాలా ఖరీదైనది, పీక్ అవర్స్‌లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. 30 మైళ్ల దూరం వెళ్లడానికి రెండు - రెండున్నర గంటలు పడుతుంది. వాహనాన్ని సులభంగా నడపాలంటే రాత్రి 11 నుంచి ఉదయం ఐదు లోపే సాధ్యం. ఎవరైనా మన్హాటన్లో నివాసం ఉన్నారు... అంటే బ్యాంకు చైర్మన్ వంటి వాళ్లు అయి ఉంటారు. వాళ్లు రోడ్డు మీద ప్రయాణించరు. హెలికాప్టర్లో వెళ్తారు. వాళ్లకు అపార్ట్మెంట్ టై మీద హెలీపాడ్ ఉంటుంది. సామాన్యులు మన్హాటన్లో నివసించాలంటే... 10 బై 10 గదిని ఐదుగురు పంచుకోవాలి. ఇదే ఖర్చుకు ఇక్కడకు దాదాపు 35 మైళ్ల దూరంలో ఉన్న లాంగ్ ఐలాండ్‌లో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వస్తుంది. ఇండియన్స్ ఎక్కువగా అక్కడ ఉంటారు. న్యూజెర్సీలో ఉండి ట్రైన్లో, ట్యాక్సీల్లో వచ్చే వాళ్లు కూడా ఎక్కువే. కానీ వాళ్లు డ్రైవ్ చేయరు. జర్నీలో పుస్తకం చదువుకుంటూ, ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ ప్రయాణించేవాళ్లే ఉంటారు. ఇక్కడ రైలు మార్గం విస్తృతంగా ఉంది. కానీ ట్రైన్ జర్నీ అన్ని సందర్భాల్లో క్షేమం కాదు. ముఖ్యంగా రాత్రి పది తర్వాత రైలు ఎక్కకపోవడమే మంచిది. ఇక్కడ రాత్రి ఒంటి గంటకు రైల్వే స్టేషన్‌కు పోలీసులు తాళం వేసి, ఉదయం ఐదు - ఆరు మధ్య తీస్తారు. క్వీన్స్‌ల్యాండ్ దీవి మన్హాటన్కు కొంచెం దూరం. ఇక్కడ ఆసియా వాసులు ఎక్కువ. జాక్సన్ హైట్స్ ప్రదేశం అయితే పూర్తిగా భారతదేశం అనే చెప్పాలి. భారతీయులకు అవసరమయ్యే వస్తువులన్నీ దొరుకుతాయి. ఆలయాలు, రెస్టారెంట్లు, ఆఖరుకు సెలూన్లు కూడా... ఇక్కడ రోడ్లలో తిరుగుతుంటే ఇండియాలో ఉన్నట్లే అనిపిస్తుంది. దుకాణాల పేర్లు కూడా ‘పటేల్ బ్రదర్స్, రాజాఫుడ్స్... ఇలా మన పేర్లే ఉంటాయి. మనకు రిలయన్స్ లాగ ఇక్కడ ఇవి చైన్ షాపులు. దాదాపు రెండు వందలకు పైగా అవుట్లెట్లు ఉంటాయి. వందేళ్ల వారధులు... న్యూయార్క్ నగరంలోని బ్రిడ్జిలను న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీ పోర్ట్ ట్రస్ట్ అథారిటీ నిర్వహిస్తుంది. ఇవన్నీ దాదాపు వందేళ్ల క్రితం కట్టినవి. రద్దీ ఎక్కువ కావడంతో ఇప్పుడు అవి సరిపోవడం లేదు. కొత్త లేన్లు వేయడానికి డబ్బు లేదు. వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ ఫీ ఎక్కువగానే ఉంటుంది. బయట నుంచి న్యూయార్క్ సిటీలోకి ఎంటరై మన్హాటన్ చేరాలంటే దాదాపుగా 16 డాలర్లు చెల్లించాలి. ఈ డబ్బంతా బ్రిడ్జిల నిర్వహణకు, చిన్న మరమ్మతులకే సరిపోతోంది. అందరూ సాయుధులే! మనకు ఆయుధాల వాడకం నిషేధం. తుపాకీ వాడాలంటే శాంతిభద్రతలు, రక్షణ, సంబంధిత వ్యవస్థలకు చెందిన వారు అయి ఉండాలి లేదా ప్రత్యేక కారణాలతో అనుమతి పొంది ఉండాలి. ఇక్కడ ఎవరైనా సరే తుపాకీ కొనుక్కోవచ్చు, వాడవచ్చు. సూపర్‌మార్కెట్, మాల్స్‌లో నిత్యావసర వస్తువులతోపాటు తుపాకీలు ఉంటాయి. అమెరికా వాళ్లు రాజ్యాంగాన్ని అలా సవరించుకున్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ‘ప్రతి పౌరుడూ ఒక సైనికుడు కావాలి’ అన్న ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ జరిగింది. ఇప్పుడు అది అనేక నేరాలకు హేతువు అవుతోంది. ఈ సంస్కృతి అమెరికా అంతా ఉన్నప్పటికీ న్యూయార్క్ నగరంలో... ముఖ్యంగా హార్లెమ్ వంటి ప్రదేశాల్లో ఎక్కువ. కొందరు గుంపులుగా నేరాలకు పాల్పడుతుంటారు. ఈ నగరానికి జమైకా చాలా దగ్గర. పైగా వాళ్ల వీసా నిబంధనల విషయంలో అమెరికా మన విషయంలో ఉన్నంత కచ్చితంగా ఉండదు. దాంతో జమైకన్ల్లు తరచు వచ్చిపోతుంటారు. మెక్సికన్లు అయితే రోడ్డు మార్గాన వచ్చేయచ్చు. ఫుడ్ హ్యాబిట్! న్యూయార్క్‌కు... ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా సరే వారి ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అన్ని ప్రాంతాల రెస్టారెంట్లు ఉన్నాయి. ఇండియన్ ఫుడ్‌లో మన దగ్గర దొరకనన్ని రకాలు దొరుకుతాయి. ఒక్క మన్హాటన్లోనే 20- 30 విలాసవంతమైన ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో భోజనం 50 డాలర్లు. ఆరు డాలర్లకు సామాన్యమైన భోజనం దొరుకుతుంది. సొంతంగా వండుకోవాలంటే గ్రోసరీ దుకాణాల్లో మన వంటకు అవసరమైన దినుసులను కొనుక్కోవచ్చు. చదివించేది ప్రభుత్వమే! ఇక్కడ స్కూలు విద్య పన్నెండవ తరగతి వరకు. అంతవరకు ప్రభుత్వం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఆ తర్వాత పిల్లలు ఆసక్తి మేరకు కాలేజ్‌లలో సీటు తెచ్చుకుని పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటారు. కొన్నిచోట్ల ప్రభుత్వ పాఠశాలలను చూస్తే మన ప్రభుత్వపాఠశాలలు చాలా బావున్నాయి అనిపిస్తుంది. నేర సంస్కృతి ప్రభావం స్కూల్లో కూడా కనిపిస్తుంది. ప్రైవేట్ స్కూళ్లు కూడా ఉంటాయి, కానీ చాలా తక్కువ, వాటిలో ఫీజు చాలా ఎక్కువ. దాదాపుగా నెలకు పదివేల డాలర్లు ఉంటుంది. ఉన్నత ఉద్యోగులు, సంపన్నులు మాత్రమే వీటిలో చదివించగలుగుతారు. పాలన పటిష్టం! న్యూయార్క్ మెట్రోపాలిటన్ నగరం. దీనికి ప్రజాప్రతినిధి మేయర్. క్రైమ్‌రేట్ తగ్గించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతుంటాయి. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా పనిచేస్తుంది. కంప్లైంట్ చేసిన వెంటనే స్పందిస్తారు. కోర్టు కేసులకు త్వరగా తీర్పు వస్తుంది. ప్రతిదీ సిస్టమాటిక్‌గా జరుగుతుంది. చేతిలో తుపాకీ ఉండడం వల్ల... తాత్కాలిక ఆవేశాలు, భావోద్వేగాలతో నేరాల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న మాట నిజమే. వాటిని నియంత్రించడానికి ప్రభుత్వ చర్యలు కూడా కఠినంగా ఉంటాయి. అందుకే సాధారణంగా ఎవరూ చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించరు. ట్రాఫిక్ జామ్ సమయంలో రోడ్డు పార్కింగ్ లాట్లాగా ఉంటుంది, అయినా ఎవరూ ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించరు. ఇండియన్ న్యూయార్క్! ఇక్కడ తమాషా ఏమిటంటే... ఇండియాలో అమెరికా ప్రొడక్ట్స్ పట్ల ఆసక్తి ఎక్కువ, ఇక్కడకు డ్రైనేజ్ పైపులు, మూతలు, ఐరన్ వంటి వస్తువులు ఇండియా నుంచి వస్తాయి. నగరంలో చాలాచోట్ల ఫుట్‌పాత్‌ల మీద అందంగా అమర్చిన పెబుల్స్ ఇండియావే. వాటిని తాకితే ఏదో ఆత్మీయబంధం సున్నితంగా స్పృశించినట్లు, మన నేల మీద ఉన్న భావన కలుగుతుంది. న్యూయార్క్‌లో ఫుట్‌పాత్ షాపింగ్ చాలా ఫేమస్. మంచి ఎక్స్‌పీరియెన్స్ కూడ. బ్రాండెడ్ నుంచి ఆర్డినరీ వరకు అన్ని రకాలూ ఉంటాయి. ఇక్కడ వీధులను అవెన్యూ, స్ట్రీట్ అంటారు. ప్రధాన రహదారి అవెన్యూ, ఇది ఉత్తరం నుంచి దక్షిణానికి ఉండే రోడ్డు, దానికి అనుబంధంగా ఉన్న రోడ్డు స్ట్రీట్. ఇది తూర్పు నుంచి పడమరకు ఉంటుంది. ప్రతి దానికీ నంబర్ ఉంటుంది. అవెన్యూలకు నంబర్‌తోపాటు ‘అవెన్యూ ఆఫ్ అమెరికా’ వంటి పేర్లు కూడా ఉంటాయి. ఇక్కడ నాటక ప్రదర్శనలకు ఆదరణ ఎక్కువ. డ్రామా థియేటర్లు ఉంటాయి. మ్యూజియాలు కూడా ఎక్కువే. న్యూయార్క్ నగరం అమెరికా ఈశాన్యప్రాంతంలో దేశ రాజధాని వాషింగ్టన్ డిసి - బోస్టన్ల మధ్య ఉంది. హడ్సన్ నది అట్లాంటిక్ మహాసముద్రంలోకి కలిసే సహజమైన ఓడరేవు. నగరం వాణిజ్యపరంగా త్వరగా అభివృద్ధి చెందడానికి ఓడరేవులు దోహదం చేస్తున్నాయి. సంప్రదాయవాదులూ ఉన్నారు! హార్లెమ్కు దగ్గరలో ‘హిసిడియాక్ జ్యూస్’ ఉంటారు. వీళ్లు డైమండ్ కటింగ్‌లో నిపుణులు. ఈ కుటుంబాలు ఇప్పటికీ తమ సంప్రదాయ వృత్తిని, వస్త్రధారణను, జీవనశైలిని కొనసాగిస్తున్నాయి. న్యూయార్క్ వజ్రాల వ్యాపారంలో ప్రపంచంలో ప్రముఖమైంది కావడంతో వారి వృత్తి కొనసాగడానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ సాధారణంగా వాతావరణానికి అనుకూలంగా దుస్తులు ధరిస్తుంటారు. హిసిడియాక్ జ్యూస్ ఏ కాలంలోనైనా షర్టు, ప్యాంటు, బరువైన లాంగ్ కోటు, విచిత్రమైన టోపీతో సంప్రదాయ వస్త్రధారణలోనే కనిపిస్తారు. న్యూయార్క్ నగరంలో ద బ్రాంక్స్, బ్రూక్లిన్, మన్హాటన్, క్వీన్స్లాండ్, స్టాటెన్లాండ్... ఈ ఐదు దీవులు ప్రధానమైనవి. యునెటైడ్ స్టేట్స్లో ఎక్కువ జనసాంద్రత కలిగిన పెద్ద నగరం ఇదే. ఇక్కడ 800 భాషలు మాట్లాడే వాళ్లు నివసిస్తున్నారు. ప్రపంచంలో ఇంతటి భాషావైవిధ్యం కలిగిన ప్రదేశం మరొకటి లేదు. నగరం మూలాలు... 1626తో లభ్యమవుతున్నాయి. డచ్ రిపబ్లిక్ ఈ ప్రదేశానికి న్యూ ఆమ్స్టర్డామ్గా నామకరణం చేసి, వ్యాపార కేంద్రంగా ఉపయోగించింది. 1664లో బ్రిటిష్ వాళ్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి ఇంగ్లండ్ రాజు రెండవ చార్లెస్ ఈ ప్రదేశాన్ని తన సోదరుడు ‘డ్యూక్ ఆఫ్ యార్క్’కు ధారాదత్తం చేస్తూ ఆమ్స్టర్డామ్ పేరును న్యూయార్క్‌గా మార్చాడు. 1785 నుంచి 1790 వరకు న్యూయార్క్ నగరం యునెటైడ్ స్టేట్స్కు రాజధాని. అప్పటి వరకు దేశంలో అతిపెద్ద నగరం కూడా ఇదే. ల్యాండ్ మార్కులకు ల్యాండ్ మార్క్! నగరంలో లెక్కలేనన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి. దేశానికి చిహ్నమైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్‌లోని లిబర్టీ ఐలాండ్‌లో ఉంది. ఇది అమెరికా స్వాతంత్య్రానికి చిహ్నం. {బాడ్వే థియేటర్ డిస్ట్రిక్ట్... పాదచారులతో రద్దీగా ఉంటుంది. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, మెట్రోపాలిటన్ మ్యూజియం... ప్రధానమైనవి. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ ప్రపంచంలో అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్. ఇక్కడ భూమి ధర ప్రపంచంలోనే అత్యధికం. చదరపు సెంటీమీటర్లలో కొలుస్తారు. క్వీన్స్ ఐలాండ్‌లో జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కడం దిగడమే కాదు చూడడం కూడా గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. 25 సెకన్లకు ఒక విమానం గాల్లోకి లేస్తుంది. టేకాఫ్ అయ్యే విమానాలు, ల్యాండ్ అయ్యే విమానాలతో చూపు తిప్పుకోలేం. ఇంతటి హెవీ ట్రాఫిక్ ఉన్న ఎయిర్‌పోర్టు ఇది. అంత రద్దీలోనూ రన్‌వే ట్రబుల్స్ కానీ ఇతర ఏ ఇబ్బందులు కూడా ఉండవు. టైమ్స్క్వేర్ను క్రాస్‌రోడ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఇక్కడికి ఏటా 5 కోట్ల మంది వస్తారు. (ఫీచర్స్ ప్రతినిధి వాకా మంజులారెడ్డికిప్రవాసాంధ్రులు శ్రీనివాస్ ప్రసాద్ కిడాంబి చెప్పిన వివరాల ఆధారంగా) Nesthama is a Latest Telugu Short Film By Fickle Mindz In association with www.runwayreel.com this movie talks about two friends and emotions involved in the relationship through the time , it is a brilliant work of director Anurag and his method of storytelling through poetry , Manoj the lead character also has carried his role in brilliance. We are evolving with each film and your appreciation and suggestions will help us grow so please encourage the young team and share the video to all your friends. | 2 Tickets for $12Xoom Increased to $25 Only by Registering Below
Register & Get $25 Gift CardArchivesJanuary 2012 CategoriesAll |
Okkadu.com Trending Topics: Indian Premier League, IPL Season 5, T-20, Twenty, Live, Streaming, Online




RSS Feed